Monday, June 5, 2023

ఆచార్య రవ్వా శ్రీహరి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : సుప్రసిద్ధ సాహితీవేత్త, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, ద్రావిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య రవ్వా శ్రీహరి రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అ నారోగ్యంతో బాధపడుతున్న రవ్వా శ్రీహరి శుక్రవారం రాత్రి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నల్లగొండ జిల్లా, వెల్వర్తికి చెందిన ఒక సామాన్య చేనేత కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1943, సెప్టెంబరు 12న జన్మించిన ఆయన చి న్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఒక చిన్న చెల్లెలు, ఒ క చిన్న తమ్ముడు గల ఆయనే ఆ ఇంటికి పెద్దగా మారా రు. సురవరం ప్రతాపరెడ్డి, ఎం.నరసింగరావుల సహాయంతో యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠంలో చేరారు. తరువాత నగరంలోని సీతారాంబాద్‌లో కల సంస్కృత కళాశాలలో డి.ఓ.ఎల్, బి.ఓ.ఎల్. వ్యాకరణం చదివారు. శఠకోప రామానుజాచార్యులు, ఖండవల్లి నరసింహశాస్త్రి, అమరవాది కృష్ణమాచార్యుల వద్ద మహాభాష్యాంతం వ్యాకరణం చదువుకున్నారు. బి.ఓ.ఎ ల్. వ్యాకరణంలో పాసైన వెంటనే వివేకవర్ధిని కళాశాలలో తెలుగు పండితుడుగా చేశారు. క్రమంగా బి.ఏ., తెలుగు పండిత శిక్షణ చేశాక, ఎం.ఏ. తెలుగు, సంస్కృతం చేసి, 1967లో ఆంధ్ర సారస్వత పరిషత్తులో లెక్చరర్‌గా పనిచేశారు.

సారస్వత పరిషత్తు విద్యార్థులకు సంస్కృతం, తెలుగూ రెండూ బోధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో 1973లో ఉద్యోగంలో చేరడంతో ఆచార్య బిరుదురాజు రామరాజు సలహాతో తెలుగులో ‘భాస్కర రామాయణం’ మీద పరిశోధన చేసి పీహెచ్ పట్టాను అందుకున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పదిహేడు సంవత్సరాలు బోధన, పరిశోధనల్ని నిర్వహించిన శ్రీహరి ద్రావిడ విశ్వవిద్యాలయానికి 2002లో ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యా రు. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్- ఇంఛార్జ్‌గా పనిచేశారు. రవ్వా శ్రీహరి మృతిపట్ల పలువురు సాహితీవేత్తలు, రచయితలు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం సంస్కృతాంధ్ర భాషలకు తీరని లోటు అని సాహితీవేత్తలు పేర్కొన్నారు.

భాషా సాహిత్య రంగాలకు
తీరని లోటు : కెసిఆర్
సుప్రసిద్ధ సాహితీవేత్త, ప్రముఖ తెలుగు సంస్కృత భాషా పండితుడు, ఆచార్య రవ్వా శ్రీహరి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన రవ్వా శ్రీహరి.. సామాన్య కుటుంబంలో జన్మించి, తన కృషి పట్టుదలతో భాషా సాహిత్య రంగంలో అంచలంచలుగా ఎదిగారని సిఎం గుర్తు చేసుకున్నారు. లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా, వైస్ చాన్సలర్‌గా పలు పదవులను చేపట్టి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన రవ్వా శ్రీహరి జీవితం స్పూర్తిదాయకమని సిఎం అన్నారు. రవ్వా శ్రీహరి మరణం, భాషా సాహిత్య రంగాలకు తీరని లోటని సిఎం విచారం వ్యక్తం చేశారు. శోకతప్తహృదయులైన ఆయన కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News