Monday, April 29, 2024

కొవిడ్ ఆంక్షల దిశగా రాష్ట్రాలు

- Advertisement -
- Advertisement -

Active cases increased to 14241

14,241కి పెరిగిన యాక్టివ్ కేసులు

4.48లక్షల మందికి
పరీక్షలు జరపగా 2451మందికి
పాజిటీవ్ 965కేసులు
రాగా, కేరళ, హర్యానాలలో 300
మందికి పైగా వైరస్
వ్యవధిలో దేశంలో 54మంది
కొవిడ్ రోగుల మృతి
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు
తప్పనిసరి
రూ.500 జరిమానా
షరతు ఉల్లంఘించిన వారికి
జరిమానా : తమిళనాడు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా రెండు వేలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరో వైపు రికవరీలకన్నా కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గురువారం 4.48 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,451 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా మళ్లీ కరోనా కేసులు పెరిగి పోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధిస్తామని కూడా ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం శుక్రవారం వివరణ ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని, దీన్ని ఉలఘించిన వారికి రూ.500 జరిమానా విధించడం జరుగుతుందని తెలిపింది. అయితే ప్రైవేటు కార్లలో ప్రయాణిస్తున్న వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని తెలిపింది. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో తమిళనాడు ప్రభుత్వం కూడా శుక్రవారం మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ, ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది.

బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ ప్రోటోకాల్‌ను పాటించే విషయంలో జనం నిర్లక్షంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జె రాధాకృష్ణన్ చెప్పారు. దేశంలో గత మూడు రోజులుగా రెండు వేలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరో వైపు రికవరీలకన్నా కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గురువారం 4.48 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,451 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముందురోజుకంటే కేసులు స్వల్పంగా పెరిగాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News