Thursday, October 10, 2024

తిరుపతి లడ్డు కల్తీపై నటుడు సుమన్ వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తిరుపతి లడ్డు కల్తీపై నటుడు సుమన్ ప్రతిస్పందించాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. శ్రీవారి లడ్డును అపవిత్రం చేసిన వారిని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని అన్నారు. లడ్డులో కల్తీ జరుగుతుంటే జరుగుతుంటే టిటిడి బోర్డు ఏం చేస్తోందని ప్రశ్నించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు.

దేవుడి ప్రసాదంను కల్తీ చేయడం మహాపాపం అన్నారు. తిరుపతి లడ్డు అంటే ఓ సెంటిమెంట్ అని, కల్తీ చేసిన వారిని ఎట్టి పరిస్థితిలో వదలొద్దని కోరారు. దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. భక్తులు వారి మతాల ప్రసాదాలను పవిత్రమైనవిగా భావిస్తారు. ప్రసాదాలను కల్తీ చేసే వారిని జైలుకు పంపాలని అన్నారు. శ్రీవారి లడ్డును కల్తీ చేయడం హిందువులకు అవమానం అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News