Monday, June 17, 2024

భగ్గుమన్న అదానీ బొగ్గు స్కామ్

- Advertisement -
- Advertisement -

ఫైనాన్షియల్ టైమ్స్‌లో వెలువడిన కథనం ప్రకారం ఇండోనేషియాలో తక్కువ నాణ్యత కలిగిన బొగ్గును 2014లో ఒక మైనింగ్ గ్రూప్ నుండి అదానీ సంస్థ కొనుగోలు చేసింది. ఇండోనేషియా షిప్‌మెంట్‌లో కిలో బొగ్గుకు 3500 క్యాలరీలు కలిగి ఉన్నట్టు ఇన్‌వాయిస్‌లో పేర్కొంది. కానీ అదే షిప్‌మెంట్‌ను తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి విక్రయించేటప్పుడు కిలో బొగ్గుకు 6 వేల క్యాలరీలుగా చూపి, అత్యంత నాణ్యమైన బొగ్గుగా నమ్మించి మోసగించింది.

కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అదానీకి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు గత కొన్నేళ్లుగా వస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలంక ప్రభుత్వంపై కూడా భారత్ నుంచి ఒత్తిడి వచ్చిందన్న ఆరోపణలు గతంలో సంచలనం కలిగించాయి. అయితే ఆ తరువాత శ్రీలంక అందులో వాస్తవాలు లేవని వివరణ ఇచ్చుకుంది. ఇదిలా ఉండగా అదానీ బొగ్గు స్కామ్ ఇప్పుడు భగ్గుమంటోంది. అదానీ గ్రూపు సరఫరా చేస్తున్న బొగ్గు నాణ్యత తక్కువగా వుందని ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరపన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు (ఒసిసిఆర్‌పి) వెల్లడించిన విషయాలు రాజకీయ, అధికార వర్గాల్లో అలజడిని సృష్టించాయి. 2014 జనవరి అక్టోబర్ మధ్య తమిళనాడు తీరంలో దిగిన కనీసం 24 సరకులు వాస్తవానికి తక్కువ ధరకే వున్నాయని ఒసిసిఆర్‌పి వెల్లడించింది. ఇండోనేషియా నుంచి రెండు వారాల సముద్ర యానం తర్వాత ఎన్నూర్ నౌకాశ్రయానికి బల్క్ క్యారియర్ చేరుకుంది.

ఇది తమిళనాడు రాష్ట్ర విద్యుత్ సంస్థ కోసం ఉద్దేశించిన 69,925 టన్నుల బొగ్గును తీసుకు వెళుతున్నట్లు ఒసిసిఆర్‌పి తెలియజేసింది. అయితే బొగ్గు ధర మూడు రెట్లు పెరిగి టన్నుకు 91.91 డాలర్లకు చేరుకుంది. నాణ్యత కూడా చాలా తక్కువగా వుందని తేలింది. ఇండోనేషియా నుంచి తక్కువ క్యాలరీలు కలిగిన నాసిరకం బొగ్గును కొనుగోలు చేసి తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టాన్‌జెడ్ కో)కి ఎక్కువ క్యాలరీలు కలిగిన బొగ్గుగా నమ్మించి విక్రయించే కుంభకోణం ఇప్పు డు బయటపడింది. ఈ కుంభకోణంలో రవాణా ఖర్చులు పోను అదానీ సంస్థ రెండింతలకు పైగా సొమ్ము చేసుకున్నట్టు ప్రముఖ బిజినెస్ డైలీ ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన వార్తా కథనం మంగళవారం వెలువడింది. ఇందులో అవినీతి ఆరోపణలతో పాటు పర్యావరణానికి ప్రమాదం కలిగించే అంశం కూడా వెలుగులోకి వచ్చింది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ కుంభకోణంపై దర్యాప్తు చేపడతామని, పార్లమెంటరీ సంయుక్త కమిటీచే విచారణ చేయిస్తామని ప్రకటించారు.

ఫైనాన్షియల్ టైమ్స్‌లో వెలువడిన కథనం ప్రకారం ఇండోనేషియాలో తక్కువ నాణ్యత కలిగిన బొగ్గును 2014లో ఒక మైనింగ్ గ్రూప్ నుండి అదానీ సంస్థ కొనుగోలు చేసింది. ఇండోనేషియా షిప్‌మెంట్‌లో కిలో బొగ్గుకు 3500 క్యాలరీలు కలిగి ఉన్నట్టు ఇన్‌వాయిస్‌లో పేర్కొంది. కానీ అదే షిప్‌మెంట్‌ను తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి విక్రయించేటప్పుడు కిలో బొగ్గుకు 6 వేల క్యాలరీలుగా చూపి, అత్యంత నాణ్యమైన బొగ్గుగా నమ్మించి మోసగించింది. కొనుగోలు చేసిన ధర కన్నా మూడింతలు ఎక్కువ ధరకు అమ్మడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఇవేవీ ఇక్కడ బయటపడకుండా కేంద్ర ప్రభుత్వ పెద్దలు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ముమ్మరంగా ఉన్నాయి. దీనికి కారణం ప్రధాని మోడీకి అదానీ అత్యంత సన్నిహితుడు కావడమేనని విపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఇదే కాదు అదానీపై జరుగుతున్న అన్ని రకాల దర్యాప్తులు ఇక్కడ బయటపడడం లేదు. 2021 నుంచి 2023 వరకు భారత్‌కు మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటుకు బొగ్గును ఎగుమతి చేసేందుకు అదానీ సంస్థ మధ్యవర్తులకే 300 కోట్ల డాలర్లు చెల్లించినట్టు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం పేర్కొంది. ఇక బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల చుట్టూ పర్యావరణం ఏ విధంగా నాశనమౌతోందో లాన్సెట్‌లో వెలువడిన అధ్యయనం వెల్లడిస్తోంది. బొగ్గు వాయు కాలుష్యంతో ఏటా 20 లక్షలకు పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారని 2022లో లాన్సెట్‌లో వెలువడిన అధ్యయనం తేల్చింది. అలాగే ఈ విద్యుత్ కేంద్రాల చుట్టూ వందల కిలో మీటర్ల పరిధిలో శిశు మరణాలు కూడా అత్యధికంగా పెరిగాయని అధ్యయనం పేర్కొంది. ఇంత భారీ ఎత్తున అదానీ బొగ్గు కుంభకోణం జరుగుతున్నా ఇడి, సిబిఐ, ఐటి సంస్థలు మౌనంగా ఉండడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు పెరుగుతుండడం చూసి ఇలాంటి స్కామ్‌లు బయటపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణంలో లూటీ అయిన వేల కోట్ల రూపాయలను తిరిగి తప్పనిసరిగా రాబట్టగలుగుతామని ఆయన చెబుతున్నారు.

పి.వెంకటేశం
9985725591

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News