Monday, May 27, 2024

అంబుజా సిమెంట్స్‌లో అదానీ గ్రూప్ వాటా పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అంబుజా సిమెంట్స్‌లో అదానీ గ్రూప్ తన వాటాను 70.3 శాతానికి పెంచుకుంది. అదానీ ఫ్యామిలీ రూ.8,339 కోట్లను ఇన్వెస్ట్ చేయడం ద్వారా అంబుజాలో మరో 3.6 శాతం వాటా పెరిగింది. హోల్సిమ్ నుంచి కంపెనీని కొనుగోలు చేసినప్పుడు ప్రమోటర్‌కు జారీ చేసిన వారెంట్లలో భాగంగా అదానీ గ్రూప్ ఈ పెట్టుబడి చేసింది. ప్రమోటర్లు కంపెనీలో ఈక్విటీల్లోకి వారెంట్ల కన్వర్టింగ్‌తో రూ.20 వేల కోట్ల పెట్టుబడులను జొప్పించారు.

2022 సంవత్సరంలో ప్రమోటర్ ఫ్యామిలీ రూ.5000 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, మరో రూ.6,661 కోట్లను మార్చిలో పెట్టుబడి పెట్టింది. అదనపు పెట్టుబడి కంపెనీ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేస్తుందని, వృద్ధి ప్రణాళిక సామర్థాన్ని పెంచడంలో దోహదం చేస్తుందని, మార్కెట్లో అవకాశాలను పెంచుతుందని అంబుజా సిమెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అదానీ గ్రూప్ 2028 సంవత్సరానికి నాటికి సిమెంట్ ఉత్పత్తి సామర్థాన్ని వార్షికంగా 140 మిలియన్ టన్నులకు పెంచాలనే ప్రణాళికతో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News