Tuesday, December 10, 2024

అదానీ కేసుతో భారత్‌కు సంబంధం లేదు:కేంద్రం

- Advertisement -
- Advertisement -

వ్యాపార దిగ్గజం అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో దాఖలైన కేసుపై భారత ప్రభుత్వం శుక్రవారం మొట్టమొదటిసారి స్పందించింది. గౌతమ్ అదానీపై అఅమెరికాలో నమోదైన అభియోగాలు ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అమెరికా న్యా శాఖకు మధ్య న్యాయపరమైన వ్యవహారమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కేసు గురించి తమకు ముందుగా ఎటువంటి సమాచారం లేదని కూడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంఇఎ) అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసులో సహకారం కోరుతూ అమెరికా నుంచి ఎటువంటి సమాచారం భారత ప్రభుత్వానికి అందలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అమెరికా న్యాయశాఖకు మధ్య ఏర్పడిన న్యాయపరమైన వ్యవహారంగా దీన్ని తాము చూస్తున్నామని, ఇటువంటి కేసులలో కొన్ని నియమ నిబంధనలు అమలులో ఉన్నాయని, వాటిని పాటిస్తారని ఆశిస్తున్నామని జైస్వాల్ చెప్పారు.

ఈ విషయం గురించి భారత ప్రభుత్వానికి ముందుగా ఎటువంటి సమాచారం లేదని, దీనిపై అమెరికా ప్రభుత్వంతో ఏ విధమైన సంభాషణ జరగలేదని ఆయన తెలిపారు. అదానీ కేసుపై అమెరికాలోని భారతీయ దౌత్య కార్యాలయాలకు అమెరికా సమన్లు కాని వారెంట్లు కాని జారీ చేసిందా అన్న విలేకరుల ప్రశ్నకు అటువంటి అభ్యర్థన ఏదీ అందలేదని జైస్వాల్ జవాబిచ్చారు. పరస్పర న్యాయ సహాయాంలో భాగంగా సమన్లు లేదా అరెస్టు వారెంట్ల జారీ కోసం విదేశీ ప్రభుత్వం నుంచి అభ్యర్థన వస్తుందని, అయితే అటువంటి అభ్యర్థనలను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కేసులో అమెరికా నుంచి ఎటువంటి అభ్యర్థన రాలేదని ఆయన తెలిపారు. 2020-24 మధ్య సౌర విద్యుత్ కాంట్రాక్టులు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్ల ముడుపులను చెల్లించినట్లు గౌతమ్ అదానీ(62), ఆయన సోదరుని కుమారుడు సాగర్, ఇతర నిందితులపై అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు నమోదు చేశారు. కాగా..ఈ ఆరోపనణలను అదానీ గ్రూపు నిరారమంటూ ఖండించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News