Saturday, May 4, 2024

ఆదిత్య తొలి చిత్రం అదుర్స్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : భారతదేశపు ప్రతిష్టాత్మక ఆదిత్యా ఎల్ 1 సుదూర ప్రయాణంలో పదనిసలు సృష్టించింది. తాను బయలుదేరిన భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ శూన్యస్థితి కక్షకు ప్రయాణిస్తున్న దశలో ఆదిత్యా ఎల్ 1 అత్యద్భుతమే చేసింది. అమర్చి ఉన్న కమెరాలతో భూమి, చంద్రుడు ఒకే వరుసలో (ఫ్రేమ్‌లో ) ఉండేలా వచ్చే ఫోటోలను తీసింది. ఈ దశలో తన ఆనందాన్ని చాటుకొంటోందా? అన్నట్లుగా తన పయనం తెలియచేస్తూ సెల్ఫీని కూడా క్లిక్ మన్పించింది. ఒకే కోణంలో భూమి , తొంగిచూస్తున్నట్లుగా ఉన్న చంద్రుడు, మరో వైపు తన స్థితిని తెలిపే సెల్ఫీతో ఇప్పుడు ఈ ఛాయాచిత్రాలు ఇస్రో భూ కేంద్రానికి అందాయి. లంగ్రాజ్ (ఎల్1 ) పాయింట్‌లో తిష్టవేసుకునే ఆదిత్యా ఎల్ 1 సూర్య మండలంపై తన విశేష పరిశోధనలు సాగిస్తుంది. కక్షలోకి వెళ్లేందుకు ఈ వ్యోమనౌకకు ప్రయోగం రోజు నుంచి 125 రోజులు పడుతుంది. అంటే దాదాపుగా వచ్చే ఏడాది జనవరి చివరికి లేదా ఫిబ్రవరి మొదటి వారానికి ఎంచుకున్న మజిలికి వెళ్లుతుంది. అప్పుడు కానీ సూర్యుడిపై విశేష పరిశోధనల క్రమం ఆరంభం కాదు. ఆదిత్యా ఎల్ 1 మిషన్ నుంచి తమకు అందిన ఇమేజ్‌లను ఇస్రో గురువారం మీడియాకు వెలువరించింది.

ఈ సందర్భంగా ఆదిత్యా ఎల్ 1ను వీక్షకుడిగా పేర్కొంటూ వీక్షకుడి విహంగ వీక్షణం అని స్పందిస్తూ నిర్ణీత భూమి సూరీడి ఎల్ 1 పాయింట్‌కు చేరే క్రమంలో ఆదిత్యా ఎల్ 1 నుంచి తీసిన సెల్ఫీ, భూమి చంద్రుడి ఫోటోలు ఇవే అనే వివరణతో ఎక్స్‌లో వీడియోను పొందుపర్చింది. ఆదిత్యా ఎల్ 1పై అమర్చి ఉన్న శక్తివంతమైన కెమెరా సాయంతో తీసిన ఈ ఫోటోలలో వ్యోమనౌకకు చెందిన వెల్క్ , సూట్ పరికరాలు కన్పిస్తున్నాయని తెలిపారు. ఆదిత్యా ఎల్ 1 నిర్ణీత కక్షలోకి చేరిన తరువాత వీటి సాయంతో సూర్యుడి కరోనా దృశ్యాలను, సూర్యుడి వలయంలోని కాంతి చిత్రాలను ఇస్రో కేంద్రానికి పంపించేందుకు వీలేర్పడుతుంది. ఇప్పుడు తీసిన చిత్రాలు ఆదిత్యా ఎల్ 1 ఈ నెల 4వ తేదీన క్లిక్ మన్పించినవి అని , ఆదిత్యా ప్రయాణం సజావుగా సాగుతున్న వైనం ఈ ఫోటోలతో స్పష్టం అవుతోందని ఇస్రో సంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీహరికోట ప్రయోగ శాల నుంచి ఆదిత్యా ఎల్ 1 ను ఈ నెల 2వ తేదీన ఇస్రో తన వరుస విజయాల క్రమంలో పరీక్షించింది. ఈ మధ్యనే దీనికి రెండోసారి భూ కక్ష పెంపు విన్యాసం చేపట్టారు, ఈ ప్రక్రియతో ఇప్పుడు ఆదిత్యా ఎల్ 1 భూమికి 282/40.225 కిలోమీటర్ల కక్షలోకి వెళ్లింది. తదుపరి కక్ష పెంపుదల ప్రక్రియను ఈ నెల 10న చేపడుతారు.

ఇప్పటికి రెండు భూ కక్షల పరిభ్రమణం రికార్డు
ఇస్రో సంధాన ఆదిత్యా ఎల్ 1 ఇప్పటికీ రెండుసార్లు భూ కక్ష చుట్టూ పరిభ్రమించింది. మరో రెండు రౌండ్లు తరువాత భూ కక్షను వదిలి ఇది నిర్ణీత లగ్రాంజే పాయింట్‌కు చేరే స్థాయికి వెళ్లుతుంది. ఆ తరువాత కక్షకు చేరి తిష్టవేసుకుంటుంది. సౌర బాహ్యవలయం భౌతిక స్థితి ఏమిటి? సూర్యుడిలోని అపార వేడిమి సంబంధిత యంత్రాంగం వంటి వివరాలను ఆదిత్యా ఎల్ 1 పరీక్షలో రాబడుతారు. కాగా సౌర తుపాన్ల పౌన్య పున్యం , హెచ్చుతగ్గులు, సూర్యుడి వాతావరణం లోని పరిణామాలను , తుపాన్ల, అంతుచిక్కని ఉష్ణోగ్రతల గురించి కూడా ఆరాతీసేందుకు ఆదిత్యా ఎల్ 1 ప్రయోగం మైలురాయి కానుంది. అన్నింటికి మించి భూమికి ఇక ఎప్పటికైనా సూర్యుడి నుంచి ముప్పు ఉంటుందా? కరోనా ద్రవ్యరాశి సిఎంఇ బయటకు దూసుకువస్తుందా? జ్వాలలు చెలరేగుతాయా? భూ అంతరిక్ష వాతావరణంపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? అనే విషయాలను ఆదిత్యా పసికడుతుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News