Saturday, July 19, 2025

రేషన్ పంపిణీ, వాలంటీర్ల తొలగింపుపై జగన్ ఫైర్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై తమకు ఎందుకు కక్ష? అని ఎపి మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేషన్ పంపిణీ, వాలంటీర్ల తొలగింపుపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రభుత్వ సేవల డోర్ డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా? అని, రేషన్ డోర్ డెలివరీ (Ration door delivery) ని రద్దు చేయడం.. పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరచినట్టు కాదా? అని అన్నారు. ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి.. ప్రజల అవస్థలను తీర్చాలి కానీ కష్టపెట్టడం సబబేనా? అని  పేదలకు ‘‘రేషన్’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? అని జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News