Sunday, December 15, 2024

అఖిల్ ప్రియురాలు ఆయన కంటే అంత పెద్దదా..?

- Advertisement -
- Advertisement -

అక్కినేని నాగార్జున ఇంట్లో సెలబ్రేషన్స్ రెట్టింపయ్యాయి. డిసెంబర్ 4న నాగచైతన్య-శోభిత వివాహం జరుగనున్న నేపథ్యంలో అక్కినేని ఇంట్లో పెళ్ళి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మరో గుడ్ న్యూస్ చెప్పింది అక్కినేని కుటుంబం. నాగార్జున రెండో కుమారుడు అఖిల్ కూడా త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ప్రకటించారు. అఖిల్ తన ప్రేయసి జైనబ్ రవ్‌డ్జీతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు వెల్లడించాడు. అంతేకాదు ఫోటోలను కూడా పంచుకున్నాడు. దీంతో అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చినట్లైంది.

అఖిల్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరని గూగుల్ అభిమానులు తెగ వెతికేస్తున్నారు. అయితే, అఖిల్-జైనబ్ వయసుల మధ్య చాలా గ్యాప్ ఉందని కథనాలు వస్తున్నాయి. అఖిల్ కంటే జైనబ్ రవ్‌డ్జీ వయసులో 9 ఏళ్లు పెద్ద అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అఖిల్ వయసు 30 ఏళ్లు కాగా.. జైనబ్ వయసు 39 ఏళ్లు అని పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏది ఏమైన ప్రేమకు వయసు అడ్డు కాదని ఇద్దరి మనసులు కలవడం ముఖ్యమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఓ మూవీ కోసం గుర్రపు స్వారీ నేర్చుకునే క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News