Saturday, April 27, 2024

లైంగిక కార్యకలాపాలకు ‘సమ్మతి వయసు’18 ఏళ్లే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  పోక్సో చట్టం ప్రకారం ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం విషయంలో ‘సమ్మతి వయసు’(ఏజ్ ఆఫ్ కన్సెంట్) పై లా కమిషన్ కీలక సూచనలు చేసింది. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే కనీస వయసును 18 సంవత్సరాలనుంచి 16 ఏళ్లకు తగ్గించాలనే వాదనలను కమిషన్ వ్యతిరేకించింది. పోక్సో చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న సమ్మతి వయసును మార్చడం అంత మంచిది కాదని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రానికి తన నివేదికను సమర్పించింది. లైంగిక నేరాలనుంచి చిన్నారులకు రక్షణ కల్పించే పోక్సో చట్టంప్రకారం 18 ఏళ్లు నిండని బాలబాలికలతో లైంగిక కార్యకలాపాలు జరపడం తీవ్ర నేరం. వారి అంగీకారంతో చేసినా అది చట్ట విరుద్ధమే. అయితే కొన్ని సందర్భాల్లో ఈ చట్టంద్వారా యుక్త వయసులో ఉన్న వారి మధ్య సంబంధాలను నిర్వచించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలోనే బాలిబాలికలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే వయసును 18 ఏళ్లనుంచి 16 ఏళ్లకు తగ్గించాలని పలు న్యాయస్థానాలు సైతం సూచించాయి. ఈ నేపథ్యంలో సమ్మతి వయసుపై ప్రత్యేక దృష్టిపెట్టిన కమిషన్ దీనిపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.‘ పోక్సో చట్ట ప్రకారం ప్రస్తుతమున్న సమ్మతి వయసు 18 సంత్సరాలను మార్చడం సరి కాదు. ఒక వేళ అలా చేస్తే.. అది బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది’ అని లా కమిషన్ అభిప్రాయపడింది. అయితే 16 18 ఏళ్ల పిల్లలకు సంబంధించి ఇలాంటి కేసుల్లో.. వారు ఇష్టపూర్వకంగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే అలాంటి కేసుల పరిష్కారానికి చట్టంలో కొన్ని సవరణలు అవసరమని లా కమిషన్ అభిప్రాయపడింది. ఆ కేసుల్లో శిక్షలు విధించేటప్పుడు న్యాయస్థానాలు విచక్షణ మేరకు నిర్ణయాలు తీసుకోవాలని కూడా కమిషన్ సూచించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News