- Advertisement -
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పెద్దచెరువులో దూకి ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిమ్స్ లో అబిజిత్ జాయ్ అనే విద్యార్థి ఎంబిబిఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం ఉదయం అభిజిత్ చెరువుతో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని చెరువులోని నుంచి బయటకు తీశారు.మృతుడి అభిజిత్ జాయ్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -