Sunday, September 15, 2024

ఇజ్రాయెల్ కు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ కు ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలను రద్దు చేసింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు అనుకూలంగా లేనందున భారత్ నుంచి తన విమానాలను రద్దు చేసుకుంది.

ఎయిర్ ఇండియా తన ఎక్స్ పోస్ట్ లో ‘‘ మధ్య ప్రాచ్యం ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు. అందుకనే టెల్ అవీవ్ కు ఇండియా నుంచి విమానాల రాకపోకలను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే పరిస్థితిని మేము నిరంతరం గమనిస్తున్నాము. టెల్ అవీవ్ కు  టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చెల్లించేస్తున్నాము’’ అని పేర్కొంది.

హమాస్ నాయకుడు ఇస్మాయిల్  టెహ్రాన్ లో చంపబడ్డాక ఈరాన్ ఎదురు దెబ్బ తీస్తామని ఇజ్రాయిల్ ను బెదిరించాక మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. గత వారమే టాటా యాజమాన్యంలోని ఎయిర్ లైన్స్ ఆగస్టు 8 వరకు నడుపబోమని ప్రకటన వెలువడింది. కాగా ఆ సస్పెన్షన్ ను ఇప్పుడు మరింత పొడగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News