Saturday, June 3, 2023

ఎయిర్‌టెల్ అపరిమిత 5జి డేటా ఆఫర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను ప్రారంభించింది. వినియోగదారులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో అపరిమిత 5జి డేటాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు రూ.239 డేటా ప్లాన్ రీచార్జ్ చేసుకోవాలి లేదా అంతకన్నా ఎక్కువ రీచార్జ్‌తో అన్‌లిమిటెడ్ 5జి డేటాను పొందవచ్చు. ఎయిర్‌టెల్ 5జి ప్లస్ సేవలు దేశంలోని 270కి పైగా నగరాల్లోని వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా అపరిమిత 5జి డేటాను వినియోగించుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News