Sunday, December 15, 2024

వేషంతో యోగి అయిపోతారా?..ఆదిత్యానాథ్‌కు అఖిలేష్ చురకలు

- Advertisement -
- Advertisement -

యోగి కావడానికి కేవలం వస్త్రధారణ సరిపోదని, ఆలోచనలు ప్రధానమని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పరోక్ష దాడికి దిగారు. పేరుకు ముందు యోగి పదం తగిలించుకుంటే, లేదా సన్యాసి వేషం కడితే యోగి అయిపోతారా? అని ప్రశ్నించారు. యుపి అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఫూల్పూర్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో అఖిలేష్ యాదవ్ ప్రసంగించారు. ఇక్కడి ముఖ్యమంత్రి ఇక గద్దె దిగే రోజు ఎంతో దూరంలో లేదని కూడా వ్యాఖ్యానించారు. ఇక్కడి ప్రభుత్వానికి నూకలు చెల్లాయనే విషయం ప్రజలకు తెలుసునని , యోగి ఇప్పుడు పలు విధాల చక్రబంధంలో చిక్కారు.

ఆయనకు బిజెపి ఢిల్లీ నాయకత్వానికి పడటం లేదన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా ఇక యోగి ఇంటికి లేదా మఠానికి వెళ్లాల్సిన తరుణం వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. మాట, దీనికి తగ్గట్లుగా ఆలోచనలు మంచివి కావల్సి ఉంటుంది. అంతేకాని కేవలం సన్యాసి దుస్తులు వేసుకుంటే సరిపోతుందా? అని చురకలకు దిగారు. యుపిలో ఓడిపోతామనే భయంతోనే బిజెపి ఇక్కడి ఉప ఎన్నికలను ఈ నెల 13 నుంచి 20కి మార్చిందని తెలిపారు. తేదీలు మారినా, వేషాలు వేసినా బిజెపికి ఓటమి తప్పదని అఖిలేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News