Thursday, May 2, 2024

2024 ఎన్నికల్లో పిడిఎదే హవా: అఖిలేశ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

లక్నో: కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీల మధ్య సీట్ల పంపిణీ వివాదం నడుస్తున్న వేళ..ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో జాతీయ స్థాయిలో విపక్ష కూటమిపై నీలినీడలు కమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమి‘ ఇండియా’పై వరుస గా విమర్శలు గుప్పిస్తున్న ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘పిడిఎ’దే హవా అంటూ సోషల్ మీడియాలో పేర్కొనడం చర్చనీయాంశమైంది.‘ మిషన్ 2024. నేతాజీ(ములాయం సింగ్’ అమరుడు. వచ్చే ఎన్నికల్లో పిడిఎ విజయం సాధిస్తుంది. అఖిలేశ్ యాదవ్ పేదలకు న్యాయం చేస్తాడు’ అని ఓ యువకుడు వంటిపై రాసుకున్నాడు.

ఇలా వంటిపై పార్టీ రంగులు( ఎరుపు, ఆకుపచ్చ) పులుముకున్న యువకుడి ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన అఖిలేశ్ ‘2024లో ఎన్నికలున్నాయి. పిడిఎదే హవా’ అని వ్యాఖ్యానించారు. పిడిఎ అంటే పిచ్‌డే( వెనుకబడిన వర్గాలు), దళితులు,అల్పసంఖ్యాక వర్గాలు అని అర్థం. రాష్ట్రస్థాయిలో ఎన్నికల పొత్తులు పని చేయవని ముందే చెబితే ఇండియా కూటమికి దూరంగా ఉండే వారమని అఖిలేశ్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి కాంగ్రెస్ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం తాజా వివాదానికి కారణమయింది. దీంతో ఎస్‌పి మధ్యప్రదేశ్‌లో18 చోట్ల అభ్యర్థులను దింపింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా అఖిలేశ్ యాదవ్ ఇండియా కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News