Sunday, April 28, 2024

నా కెరీర్‌లో అద్భుతమైన సంవత్సరం అది: హార్దిక్ పాండ్యా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆ సంవత్సరం చేసిన ప్రదర్శనతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని, ఆ సంవత్సరం విఫలమైతే ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదు అని టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపారు.  స్టార్ స్పోర్ట్ నిర్వహించిన ఫ్యాన్ ఈవెంట్‌లో హార్దిక్ మాట్లాడారు. ఐపిఎల్‌లో 2015 అంటే తనకు ఎంతో ఇష్టమని, తన కేరీర్‌లో అద్భుతమైన సంవత్సరం అని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపారు.  మంబయి ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 2015లో చావోరేవో లాంటి రెండో మ్యాచ్ లలో అద్భుతంగా ఆడడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నానని, అందుకే అది బెస్ట్ మెమరీ అని పాండ్యా పేర్కొన్నారు. దీంతో అక్కడి నుంచి తన ప్రయాణం మొదలైందని, ఐపిఎల్‌లో రాణించడంతో ఆల్‌రౌండర్‌గా టీమిండియాలోకి వచ్చానని పాండ్యా చెప్పుకొచ్చారు. ఆ టోర్న్‌మెంట్ కారణంగా గుజరాత్ నుంచి వచ్చి ఓ కుర్రాడు అన్ని సాధించగలిగాడని తెలియజేశాడు. 2015లో మొదటి నాలుగు మ్యాచ్‌లు ముంబయి జట్టు ఓడిపోయింది. దీంతో తమ జట్టు పనైపోయిందని అందరూ అనుకున్నారు.. కానీ తరువాత జరిగిన మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు వెళ్లామని, ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబయి ఇండియన్స్ గెలిచి రెండో సారి కప్పును అందుకుంది.

ఐపిఎల్‌లో గుజరాత్‌కు కెప్టెన్సీ అందుకోగానే టైటిల్ సాధించాడు. దీంతో అతడికి బిసిసిఐ టిమిండియా కెప్టెన్‌గా నియమించింది. టి20ల్లో వరస విజయాలు సాధించి దూకుడు ప్రదర్శించాడు. 2024 ఐపిఎల్‌లో ముంబయి ఇండియన్స్ టీమ్‌కు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News