Tuesday, April 30, 2024

ఓడిన కివీస్… టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆస్ట్రేలియా చేతిలో న్యూజిలాండ్ ఓటమిని చవిచూడడంతో భారత్ మొదటి స్థానంలోకి దూసుకొచ్చింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్ నడుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో టాప్ -2 ఉన్న రెండు జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. ఇప్పటికే భారత జట్టు డబ్ల్యుటిసి ఫైనల్‌కు రెండు సార్లు చేరుకుంది. మూడో సారి చేరుకోవడంపై టీమిండియా గురిపెట్టింది. ఆసీస్‌తో మొదటి టెస్టు ఆడకముందు న్యూజిలాండ్ తొలి స్థానంలో ఉంది. ఆసీస్‌తో తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓడిపోవడంతో రెండో స్థానంలో ఉన్న టీమిండియా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో కివీస్ రెండో స్థానానికి చేరుకుంది. 64.58 శాతం విజయాలతో భారత జట్టు తొలి స్థానంలో ఉండగా న్యూజిలాండ్ 60 శాతం విజయాలతో రెండో స్థానం, 59.09 శాతం విజయాలతో ఆసీస్ మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ జట్టు గెలిస్తే తొలి స్థానంలో ఉంటుంది. ఈ టెస్టులో ఓడిపోతే మూడో స్థానానికి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మార్చి 8 నుంచి ఆసీస్-కివీస్ రెండో టెస్టు జరగనుంది. తరువాత నాలుగు నెలల పాటు రెండు జట్లు టెస్టు మ్యాచ్‌లు ఆడవు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News