Monday, April 29, 2024

బీమారీ దశ లేని మధ్యప్రదేశ్ ప్రోగ్రెస్ రిపోర్డు విడుదల చేసిన షా

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రోగెస్ కార్డును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. 2003 నుంచి 2023 వరకూ బిజెపి హయాంలో రాష్ట్ర ప్రగతి పేరిట దీనిని వెలుగులోకి తీసుకువచ్చారు. ఇంతకు ముందు రాష్ట్రం బీమార్ (వెనుకుబాటుతనం) పరిధిలో ఉండేదని, కాంగ్రెస్ హయాంలోని ఈ దుస్థితి ఇప్పుడు పోయిందని ఈ సందర్భంగా అమిత్ షా తెలిపారు. 2003లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టడం ద్వారా రాష్ట్ర ప్రజలు విజ్ఞత ప్రదర్శించారని కొనియాడారు.

ఇప్పుడు బిజెపి హయాంలో రాష్ట్రం స్వయం సమృద్ధిగా ఉందని తెలిపారు. భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు విడి శర్మ, రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హాజరయిన నేపథ్యంలో ఈ ప్రగతి సూచీని కేంద్ర మంత్రి విడుదల చేశారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రోగ్రెస్ కార్డును బిజెపి ప్రభుత్వం రూపొందించింది. ఈసారి కూడా లోక్‌సభ ఎన్నికల్లో పనిఘనతతో బిజెపి గెలుస్తుందని కార్యక్రమంలో అమిత్ షా దీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News