Monday, April 29, 2024

ఉల్లి ఘాటెక్కకుండా ప్రయత్నాలు..

- Advertisement -
- Advertisement -

ముంబై : టమాటా ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపించగా, ఇప్పుడిప్పుడు వీటి ధరలు దిగొస్తున్నాయి. ఈ తరుణంలో ఉల్లి ఘాటెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తరాదిన భారీ వర్షాల కారణంగా ఉల్ల పంట తగ్గడంతో రేట్లు పెరగవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టమాట మాదిరిగా కాకుండా ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీటి ఉత్పత్తిని పెంచాలనుకుంటోంది. ఈ ఏడాది మొత్తం 5 లక్షల ట్రిలియన్ల బఫర్ నిల్వల నిర్వహణకు గాను అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తిని చేయనున్నట్టు ఆదివారం ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా రిటైల్ వినియోగాన్ని వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో సరఫరాను పెంచి, ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై 40 శాతం పన్ను విధించగా, ఈ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజు బఫర్ నిల్వలను పెంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2023-24) ఉల్లి బఫర్ నిల్వల లక్షం 3 లక్షల టన్నులు ఉండగా, ఇది ఇప్పటికే ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం ఈ నిల్వలను దేశంలోని వివిధ రాష్ట్రాల మార్కెట్లకు లక్ష్యాల మేరకు తరలించి, ధరల నియంత్రణకు చెక్ పెట్టారు. అధికారిక గణాంకాల ప్రకారం, ఆదివారంనాడు దేశవ్యాప్తంగా కిలో ఉల్లి సగటు రిటైల్ ధర 19 శాతం పెరిగి రూ.29.73కు చేరింది. అయితే ఏడాది క్రితం ఇదే సమయంలో ఉల్లి కిలో ధర రూ.25గా ఉంది. ఢిల్లీలో ఉల్లి రిటైల్ ధర రూ.28 నుంచి రూ.37కు పెరిగింది. ప్రభుత్వం తొలుత 3 లక్షల టన్నుల ఉల్లి టార్గెట్‌ను చేరుకున్న తర్వాత ఈ ఏడాదిలో దీనిని 5 లక్షల టన్నులకు పెంచాలని ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. అయితే దేశంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించింది. ఇప్పటి వరకు ఉల్లి ఎగుమతులపై ఎలాంటి పన్ను విధించలేదు.

ఈ చర్యతో దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ధరలను కూడా అదుపులోకి తేనుందని ఈ మేరకు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఉల్లిపాయల సగటు రిటైల్ ధర శనివారం కిలోకు రూ.30.72గా ఉంది. మిజోరంలోని చంపాయ్‌లో గరిష్ట ధర కిలో ఉల్లి రూ.63 కు చేరింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్, బుర్హాన్‌పూర్‌లో అతి తక్కువ ధరలో కిలో ఉల్లిని రూ.10కి విక్రయిస్తున్నారు. క్రిసిల్ ఈ నెల ప్రారంభంలో తన నివేదికలో ఉల్లి సరఫరా తగ్గిన కారణంగా సెప్టెంబర్ ప్రారంభం నాటికి కిలో రూ.60-70కి చేరవచ్చని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News