Friday, April 26, 2024

కత్రినా పెళ్లి.. అమితాబ్ దంపతుల కన్యాదానం!

- Advertisement -
- Advertisement -

Katrina-Kaif

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి కత్రినా ఖైఫ్ పెళ్లి కూతురైంది. వధువు తరఫున పెద్దలుగా సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయా బచ్చన్ మారారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కల్యాణ వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ స్టార్ హీరోలు నాగార్జున, ప్రభు, శివ రాజ్‌కుమార్ ముఖ్య భూమికలు పోషించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అమితాబ్ బచ్చన్ గురువారం ట్వీట్ చేశారు. పెళ్లి మండపానికి వధువు కత్రినాను అమితాబ్, జయా బచ్చన్ తోడ్కొని వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోల వెనుక ఉన్న కథ వింటే మీరు కూడా షాక్‌కు గురవుతారు.

ఉత్తరాది సంప్రదాయ దుస్తులతోపాటు దక్షిణాది పంచెకట్టు, చీరకట్టు, ఆభరణాలతో అమితాబ్ దంపతులు పెళ్లి పెద్దలుగా మారడం నెటిజన్లను ఆనందపరిచింది. అసలు ఈ పెళ్లి కథేమిటంటే.. కల్యాణ్ జువెలర్స్ వారి తాజా వాణిజ్య ప్రకటన కోసం ఈ పెళ్లి వేడుకను నిర్వహించారు. కత్రినా పెళ్లి కూతురిగా మారగా అమితాబ్ దంపతులు ఆమె తల్లిదండ్రులుగా నటించారు. ఇక ఈ యాడ్‌లో నాగార్జున, శివ రాజ్‌కుమార్, ప్రభుల పాత్రలేమిటన్నది వెల్లడి కాలేదు. అమితాబ్ మాత్రం ఈ ముగ్గురు స్టార్లతో తీసుకున్న ఫోటోను షేర్ చేసి తన ఆనందం పంచుకున్నారు.

నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, శివ రాజ్‌కుమార్ తండ్రి రాజ్‌కుమార్, ప్రభు తండ్రి శివాజీ గణేశన్‌లతో తన అనుబంధాన్ని అమితాబ్ తెలియచేశారు. ఆ మహానటులు నటించిన చిత్రాల రీమేక్‌లో నటించే అదృష్టం తనకు కలిగిందని చెబుతూ వారి కుమారులు కూడా తమ తండ్రి నుంచి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నందుకు అభినందించారు. అక్కినేని చివరి చిత్రం మనంలో నటించే అదృష్టం తనకు లభించినందుకు ఆయన నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. ఆ మూడు కుటుంబాలతో తనకు చక్కని ప్రేమానుబంధం ఉందని ఆయన తెలిపారు.

Nagarjuna

Amitabh becomes father of Katrina Kaif, Nagarjuna, Prabhu, Shiv Rajkumar acted alongwith Amitabh in Kalyan Jewellery Ad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News