Monday, July 15, 2024

లోక్‌సభ ఎంపిగా ప్రమాణం చేసిన అమృత్‌పాల్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జైలు నిర్బంధితులైన, పెరోల్ మంజూరైన రాడికల్ సిక్కు మత బోధకుడు అమృత్‌పాల్ సింగ్, కాశ్మీరీ నాయకుడు షేఖ్ అబ్దుల్ రషీద్ శుక్రవారం లోక్‌సభలో ఎంపిలుగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి పెరోల్ మంజూరైన ఆ ఇద్దరూ పార్లమెంట్ సముదాయంలోను, పరిసరాల్లోను భారీ భద్రత బందోబస్తు నడుమ ఎంపిలుగా ప్రమాణ స్వీకారంచేశారు.

ఇంజనీర్ రషీద్‌గా పేర్కొంటున్న రషీద్ యుఎపిఎ కింద నమోదైన ఉగ్ర నిధుల కేసులో ఢిల్లీ తీహార్ జైలులోను, అమృత్‌పాల్ సింగ్ జాతీయ భద్రత చట్టంకింద నేరాలకు అస్సాం దిబ్రూగఢ్ జిల్లాలో జైలులో నిర్బంధంలో ఉన్నారు. వారిని భద్రత సిబ్బంది శుక్రవారం ఉదయం పార్లమెంట్ సముదాయానికి తీసుకువచ్చారు. ఎంపిలుగా ఎన్నికైన ఆ ఇద్దరూ లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం లోక్‌సభ స్పీకర్ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేసినట్లు ఒక ప్రతినిధి తెలిపారు.

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 31 ఏళ్ల అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నుంచి, 56 ఏళ్ల ఇంజనీర్ రషీద్ జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా నుంచి ఇండిపెండెంట్లుగా ఎన్నికయ్యారు. వారు ఇతర విజేత అభ్యర్థులతో పాటు జూన్ 24, 25 తేదీల్లో 18వ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ప్రమాణ స్వీకారం నిమిత్తం రషీద్‌కు తీహార్ నుంచి పార్లమెంట్ వరకు ప్రయాణ సమయాన్ని మినహాయించి రెండు గంటల కస్టడీ పెరోల్ మంజూరైంది. అమృత్‌పాల్ సింగ్‌కు అస్సాం నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించవలసిన దృష్టా శుక్రవారం(5) నుంచి నాలుగు రోజుల పాటు పెరోల్ మంజూరైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News