Monday, April 29, 2024

80 ఏళ్ల వృద్ధుడికి 45 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

బాలికపై అత్యాచారం కేసులో కోర్టు తీర్పు

ఇదుక్కి(కేరళ): ఒక 14 ఏళ్ల బాలికపై పలుసార్లు అత్యాచానికి పాల్పడిన నేరానికి ఒక 80 ఏళ్ల వృద్ధునికి స్థానిక కోర్టు మొత్తంగా 45 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద నిందితుడికి వివిధ శిక్షలను ఖరారు చేసిన ఇదుక్కి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి టిజి వర్గీస్ మొత్తం 45 ఏళ్ల జైలు శిక్షను విధించినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ షియో మోన్ జోసెఫ్ గురువారం తెలిపారు. అయితే గరిష్ఠంగా ఏ వ్యక్తికైనా 20 ఏళ్ల కారాగార శిక్షను మాత్రమే విధించవలసి ఉన్నందున నిందితుడు 20 ఏళ్లపాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

అంతేగాక నిందితుడు బాలికకు రూ. 60,000 పరిహారాన్ని చెల్లించాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు. బాధితురాలి పునరావాసం కోసం రూ. 5,000 అందచేయాలని జిల్లా న్యా సేవా సంస్థను కూడా న్యాయమూర్తి ఆదేశించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై 2021లో అత్యాచారం జరిగిందని ఎస్‌పిపి తెలిపారు. బాలిక తండ్రి మరణించాడని, తల్లి అనాథగా వదిలివేసిందని, దీంతో తన తండ్రికి చెందిన బంధువుల ఇంట్లో ఆ బాలిక తలదాచుకుందని ఆయన చెప్పారు. ఆ బాలిక ఇంటి సమీపంలో దుకాణం నడుపుతున్న వృద్ధుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి ఆ బాలికపై వరుసగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News