Thursday, April 25, 2024

ఆకట్టుకుంటున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్

- Advertisement -
- Advertisement -

ఇందిరాపార్కు సమీపంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ (చేపల ఆహార పండుగ) సందర్శకులను ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ జిల్లా మత్స శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన చేపల ఆహార పండుగ మరో రెండ్రోజుల పాటు కొనసాగనుంది. మత్య శాఖ ఆధ్వర్యంలో సుమారు 600 మందికి ప్రత్యేక శిక్ష ణ పొందిన మహిళలు ఈ ఫెస్టివల్‌లో రకరకాల చేపల వంటకాలను ఎన్‌టిఆర్ స్టేడియంలో ప్రదర్శనకు ఉం చారు. రాష్ట్ర పశుసంవర్థక, మత్య, పాడి పరిశ్రమల అభివృద్ది శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రకరకాల చేపలతో తయారు చేసిన వంటకాలను, రొయ్యలతో చేసిన ఫ్రై, బిర్యానీ, పకోడి, పులుసు తదితర స్టాల్స్‌ను సందర్శించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన మత్య కారులతో సు మారు 1 లక్ష మంది సభ్యత్వం చేయనున్నట్టు చెప్పారు. మత్యకారులకు ద్విచక్ర, ట్రాలీ ఆటోలు, ట్రక్కులను సబ్సిడీపై అందజేస్తామన్నారు. రాష్ట్రంలో రూ.7 వేల కోట్ల మత్య సంపద ఉత్పత్తి అవుతోందన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ చేపలు తినడం ద్వారా ఎలాంటి రోగాలు అయినా న యం అవుతాయని అన్నా రు. చేపలు మంచి ఆహారం అని అన్నారు.

కార్యక్రమంలో మత్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదర్ సిన్హా, క మీషనర్ లచ్చిరాం నాయక్, హైదరాబాద్ ఏడి చరితారెడ్డి, జిహెచ్‌ఎంసి మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వి. శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు రచన శ్రీ, సామల హేమ, బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసింహ తదితరులు పాల్గొ న్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News