Saturday, December 14, 2024

మూడేళ్ల బాలికపై హత్యాచారం… మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు

- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం జరిగింది. వడమాటపేట మండలంలో మూడున్నరేళ్ల బాలికను సుశాంత్(22) అనే యువకుడు హత్యాచారం చేసిన సంఘటన కలకలం సృష్టించింది.  బాలికకు సుశాంత్ సమీప బంధువు కావడంతో చాక్లెట్ ఇప్పిస్తానని చిన్నారిని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను హత్య చేసి పూడ్చి పెట్టాడు. బాలిక కనిపించకపోవడంతో పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితుడు సుశాంత్‌ను విచారించగా దారుణం వెలుగులోకి వచ్చింది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News