Saturday, December 14, 2024

లంచ్ బ్రేక్.. రిషబ్ పంత్ ఔట్

- Advertisement -
- Advertisement -

న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది.అర్థశతం బాది మంచి ఊపు మీదున్న రిషబ్ పంత్(60)ను కివీస్ బౌలర్ సోదీ ఔట్ చేసి పెవిలియన్ కు పంపాడు. దీంతో గిల్, పంత్ కీలక భాగస్వామ్యానికి తెరపడంది.

అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజాతో కలసి మళ్లీ ఇన్నింగ్స్ నిర్మించేందుకు గిల్ ప్రయత్నిస్తున్నాడు. అతను కూడా అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్రీజులో గిల్(70), జడేజా(10)లు ఉన్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును సమం చేయాలంటే భారత్ ఇంకా 40 పరుగులు చేయాల్సి ఉంది. కివీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News