Friday, April 19, 2024

రాష్ట్ర డిజిపిగా అంజనీకుమార్ బాధ్యతల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర నూతన డిజిపిగా అంజనీకుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. పూర్వ డిజిపి మహేందర్‌రెడ్డి నుంచి బాధ్యతలు చేపట్టారు. డిజిపి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహేందర్‌రెడ్డికి వీడ్కోలు పలికిన ఉన్నతాధికారులు, అదే సమయంలో కొత్త డిజిపి అంజనీకుమార్‌కు స్వాగతం పలికారు. అనంతరం డిజిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ దేశానికే ఆదర్శం. ప్రతి అధికారి లీడర్‌గా పనిచేయాలి. క్విక్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రజలకు నిరంతరం రక్షణగా ఉంటాం అని తెలిపారు. రాష్ట్ర డిజిపిగా నియమితులైన అంజనీకుమార్‌కు ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఐపిఎస్ అధికారుల్లో సీనియార్టీ జాబితాలో అంజనీకుమార్ ముందువరసలో ఉన్నారు. 1966 జనవరి 28న బీహార్‌లో జన్మించిన అంజనీకుమార్ పాట్నా సెయింట్ జేవియర్ స్కూల్‌లో ప్రాథమిక, ఉన్నత విద్యను, ఢిల్లీ విశ్వవిద్యాలయానికి పిజి పూర్తి చేశారు.

1992లో జనగామ ఎఎస్‌పిగా నియమితులైన అంజనీకుమార్ అంచెలంచెలుగా ఎదిగి డిజిపి అయ్యారు. మహబూబ్‌నగర్ అదనపు ఎస్‌పి(ఆపరేషన్స్)గా, ప్రకాశం, గుంటూరు జిల్లాల ఎస్‌పిగా పనిచేశారు. 1998లో ఐక్యరాజ్యసమితికి డిప్యూటేషన్‌పై వెళ్లి బోస్నియాలో శాంతిదళాలతో కలిసి పనిచేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చి రెండు మెడళ్లు పొందారు. 2003 వరకు సిఐఎస్‌ఎఫ్‌లో పనిచేసి, అనంతరం రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. 2005 నుంచి 2011 వరకు గుంటూరు, నిజామాబాద్ రేంజ్ డిఐజిగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ డిఐజిగా, గ్రేహౌండ్స్ చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. 2011-2012 మధ్యలో వరంగల్ ఐజిగా, 2012-2013 వరకు ఐజి కమ్యూనికేషన్‌గా, 2018-2021 వరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా, అనంతరం ఎసిబి డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర డిజిపిగా నియమితులైన అంజనీకుమార్‌కు ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఐపిఎస్ అధికారుల్లో సీనియార్టీ జాబితాలో అంజనీకుమార్ ముందు వరుసలో ఉన్నారు.

1966 జనవరి 28న బీహార్‌లో జన్మించిన అంజనీకుమార్ పాట్నా సెయింట్ జేవియర్ స్కూల్‌లో ప్రాథమిక, ఉన్నత విద్యను, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పిజి పూర్తి చేశారు. ఐపిఎస్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు రెండు అవార్డులతోపాటు రాష్ట్రపతి పోలీసు మెడల్ అందుకొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసుల 500 ఏళ్ల చరిత్రపై పుస్తకంలోనూ తన భాగస్వామ్యాన్ని అంజనీకుమార్ అందించడం గమనార్హం. 2026 జనవరిలో పదవీ విరమణ చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News