Sunday, April 28, 2024

కెనడాలో మరో ఖలిస్థాన్ ఉగ్రవాది హతం..

- Advertisement -
- Advertisement -

కెనడాలో మరో ఖలిస్థాన్ ఉగ్రవాది హతమయ్యాడు. కెనడాలోని విన్నిపెగ్ పట్టణంలో రెండు గ్యాంగుల మధ్య చోటుచేసుకున్న గొడవలో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ హత్యకు గురయ్యాడు. ఇప్పటికే ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య.. భారత్-కెనడా మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పుడు మరో ఖలిస్థానీ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. కెనడాలో జూన్ లో జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. ఇది తమ దేశంలోకి చొరబడటమే అవుతుందని ఆక్షేపించారు. ఈ వాదనను భారతదేశం తిప్పికొట్టింది. కెనడా, ఇండియాలు పరస్పరం దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించాయి.

కెనడాలో అత్యధిక సంఖ్యలో సిక్కులు ఉండటంతో ఖలీస్థానీల పట్ల కెనడా ప్రభుత్వం ఎటువంటి చర్యలకు దిగలేకపోవడం, నేతలు బహిరంగంగానే ఖలీస్థానీవాదులకు మద్దతు ప్రకటించడం సంక్లిష్ట పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య విద్యాకార్యకలాపాలపై ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపింది. ఈ మధ్యకాలంలో అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు, ఐటి యువత ఎక్కువగా కెనడాకు వెళ్లుతున్నారు. వీసాల నిబంధనలు సరళీకృతంగా ఉండటంతో కెనడానే కార్యస్థలిగా ఎంచుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News