Wednesday, May 1, 2024

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కా ర్మిక,కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై కేంద్ర కార్మిక సంఘాలు చేస్తున్న పో రాటాలతో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటి యు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మినారాయణ పిలుపునిచ్చారు. సిఐటియు నాంపల్లి మండల జనరల్‌బాడి సమావేశం సిఐటియు నాంపల్లి కార్యాలయం లో మంగళవారం కోరె లలిత అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ము ఖ్య అతిథిగా హాజరైన ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44కార్మిక చట్టాలను నాలు గు లేబర్ కోడ్‌లుగా విభజించి కార్మికుల చట్టాలను కాలరాస్తుందని విమర్శించారు. కనీస వేతన చట్టం ప్రకారం 26వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం కార్మికుల హక్కులపైన దా డిగా ఆయన అభివర్ణించారు.

అధిక ధరలు, నిరుద్యోగం,ప్రజల సమస్యలపైన 11 కార్మిక కేంద్రకార్మిక సంఘాలు ఆగస్టు నెలలో పెద్ద ఎత్తున ఆంధోళన చేపడతాయని, ఈ పోరాటంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం విఆర్‌ఏ, జూనియర్ పంచాయితీ కార్యదర్శులు,గ్రామ పంచాయితీ కార్యికులకు,ఐకెపి వివోఏలు, ఆశావర్కర్లకు ఇచ్చిన హామిలను వెంటనే అమలు చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలక సిద్దం అవుతుందని లక్ష్మినారాయణ హెచ్చరించారు.ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడు తూ జులై 3న ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జ రుగనున్న కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కొమ్ము ల క్ష్మయ్య, వివిద యూనియన్‌ల నాయకులు ఎస్‌కె సైదాబేగం, రెడ్డిమల్ల గోవిందరాజు, గాదెపాక మరియమ్మ, పగిళ్ల నరేష్, సునీత, ఎదుల్ల కవిత, కె.శ్రీకాం త్, వంగూరి యాదయ్య, మల్లేశ్వరి, ఎల్లయ్య, సైదమ్మ, లక్ష్మమ్మ, సులోచ న,సుజాత, బిక్షపమ్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News