Wednesday, April 24, 2024

అమిత్ షాతో సిఎం జగన్ భేటీ.. పెండింగ్‌ సమస్యలపై చర్చ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం జగన్ మోహన్ రెడ్డి గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు, మెయిన్‌ డ్యామ్‌ సైట్‌లో పూడిక తీయడానికి రూ.2,020 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.2,601 కోట్లను రీయింబర్స్‌మెంట్ చేయాలని, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద పెండింగ్‌లో ఉన్న రూ.36,625 విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరారు. మహమ్మారి తర్వాత రూ. 42,472 కోట్ల నుంచి తగ్గించబడిన రూ. 17,923 కోట్ల క్రెడిట్ పరిమితిని పెంచాలని కూడా సిఎం జగన్ అమిత్ షాను కోరినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News