Friday, April 19, 2024

ఎపి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో దిమ్మతిరిగే ఉత్తర్వులు…

- Advertisement -
- Advertisement -

AP Govt's strict orders regarding employees

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో దిమ్మతిరిగే ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్ని ఆదేశాలు ఇచ్చినా జిల్లా కలెక్టర్లతో ఎన్ని వార్నింగులు ఇచ్చినా అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే చాలా సీరియస్ గా తీసుకుంది. 17వ తేదీ నుంచి ప్రతీ ఉద్యోగి ఉదయం పదగంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధి నిర్వహణలో ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అంతే కాకుండా ప్రతీనెలా 75 ప్రభుత్వశాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఇలా మొత్తం వారి మాన్యువల్,బయో మెట్రిక్ అటెండెన్సు సాధారణ పరిపాలన శాఖకు పంపించాలని పేర్కొంది. ఇకపై ఉద్యోగులు విధినిర్వహణలో చేసిన విధులకు సంబంధించి మాత్రమే జీతబత్యాలు ఇచ్చేలా చర్యలు తీసుకోబుతన్నారనే వార్నింగ్ కూడా ఉత్తర్వులతో పేర్కొంది. ఇటీవలే ఐఏఎస్ అధికారులకు సైతం ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్సు అమలు చేసిన ప్రభుత్వం ఉదయం10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధుల్లో ఉండాలనే ఉత్తర్వులు ఇపుడు ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News