Sunday, January 26, 2025

ఎపి సిఎంను కలిసిన కొత్త డిజిపి

- Advertisement -
- Advertisement -

AP New DGP Rajendranath Reddy Meets CM Jagan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన డిజిపిగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిజిగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి ఎపి ప్రభుత్వం డిజిపిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈక్రమంలో 1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి 1994లో ఉమ్మడి ఎపిలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్‌పిగా సర్వీసు ప్రారంభించి కాలక్రమంలో విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సిఐడి, రైల్వే ఎస్‌పిగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గానూ విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించిన ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News