Monday, April 29, 2024

బిసి గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా పూలే బిసి సంక్షేమ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. పదవ తరగతి, సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరవుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బిసి గురుకుల విద్యాలయాల సంస్థ ఒక ప్రకటనలో సూచించింది. విద్యార్థులు https://mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 130 బాలుర, 125 బాలికల జూనియర్ కళాశాలల్లో (ఇంగ్లీష్ మీడియం) ఎంపిసి, బైపిసి, సిఇసి, హెచ్‌ఇసి, ఎంఇసి , ఇతర వృత్తివిద్యా కోర్సుల్లో, 6 మహిళా, 8 పురుష డిగ్రీ కళాశాలల్లో బిఎస్‌సి ఫిజికల్ సైన్స్(ఎపిసి, ఎంపిసిఎస్, ఎంఎస్‌సిఎస్, ఎంఎస్ డిఎస్, ఎంఎస్‌ఎఐ, ఎమ్‌ఎల్, ఎంపిజి, ఎంఇఎస్,

ఎంఇసిఎస్)కోర్సుల్లో , బిఎస్‌సి లైఫ్ సైన్స్ , బికాం (జనరల్, కంప్యూటర్), బిఎ, బిబిఎ, బిఎఫ్‌టి తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 20న హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తు రుసుము రూ. 200 ,చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు పనిదినాల్లో 04023328266 సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News