Thursday, January 26, 2023

కొత్త అనుభూతినిచ్చే పాత్ర నాది

- Advertisement -

హైదరాబాద్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్న ఫీల్‌గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా అర్జున్ దాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఒకసారి నిర్మాత వంశీ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు.

మరుసటి రోజు దర్శకుడు రమేష్ చెన్నై వచ్చి నన్ను కలిసి కథ, పాత్ర గురించి వివరించారు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి వంశీని కలిసి ఈ సినిమాలో భాగం కావడం జరిగింది. ఈ చిత్రంలో నా పాత్ర పేరు ఆర్.కె. నా పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. ‘బుట్టబొమ్మ’ కోసం మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నాను. నేను ఈ సినిమా ఒప్పుకునే ముందే నిర్మాత వంశీ సొంతంగా డబ్బింగ్ చెప్పాలని షరతు పెట్టారు. మా నిర్మాతలు సినిమాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. దర్శకుడు రమేష్ మీద నమ్మకం ఉంచి ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles