Tuesday, May 30, 2023

నిఖత్ జరీన్ కు అర్జున అవార్డు రావడం పట్ల మంత్రి ఎర్రబెల్లి హర్షం

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బిడ్డ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీస్‌కు దేశంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. అంచలంచలుగా ఎదిగి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీస్ కు అర్జున అవార్డు రావడం తెలంగాణకే గాక, దేశానికి గర్వకారణం అన్నారు. ప్రపంచ స్థాయిలో మరింతగా రాణించి దేశ కీర్తిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News