Tuesday, September 10, 2024

జమ్మూ ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కెప్టెన్ మృతి..

- Advertisement -
- Advertisement -

జమ్మూ: జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న కాల్పుల పోరులో ఒక ఆర్మీ కెప్టెన్ మరణించగా మరో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పౌరుడు గాయపడినట్లు వారు చెపపారు. శివ్‌గఢ్-అస్సార్ బెల్ట్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదుల కోసం భద్రతా దలాలు గాలింపు జరుపుతుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

కాల్పులలో తీవ్రంగా గాయపడిన ఆర్మీ కెప్టెన్‌ను సైనిక ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆయన మరణించారని అధికారులు చెప్పారు. కాగా, ఆ ప్రాంతంలో రక్తంతో తడిసిన నాలుగు గోనెసంచులు దొరికాయని, నలుగురు ఉగ్రవాదులు మరనించి ఉంటారని అనుమతిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఎం 4 కార్బైన్స్ కూడా లభించినట్లు వారు చెప్పారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోందని వారు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News