- Advertisement -
హైదరాబాద్: జమ్ము కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ఖండించారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంపి అసదుద్దీన్ ఒవైసి, ఎంఎల్ఎ అక్బరుద్దీన్ ఒవైసి, మజ్లిస్ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసి మీడియాతో మాట్లాడారు. ఇంటెలిజెన్సీ వైఫల్యం, విదేశీ పర్యాటకుల మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పుల్వామా కంటే పెద్ద ఘటన అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.
- Advertisement -