Wednesday, June 19, 2024

ఉత్తమ్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసి ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

asaduddin-owaisi

హైదరాబాద్: నగర పొలీసు కమిషనర్‌పై టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ట్విటర్ వేదిక ద్వారా స్పందిస్తూ దారుస్సలాంలో చాలా విశాలమైన స్థలం ఉందన్నారు. గతంలో ఇందిరాగాంధీ సభకు దారుస్సలాం వేదికగా నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఉత్సహంగా చూపుతున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం , ఇటీవల నిజామాబాద్‌లో తాము నిర్వహించే సభకు ఆహ్వానిస్తే, టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు హజరుకాలేదని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 4లేదా5వ తేదీ మజ్లిస్ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వాలని 20డిసెంబర్ నగర సిపికి దరఖాస్తు చేశామని వెల్లడించారు. ఈ మేరకు మజ్లిస్ అధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రెండు మార్గాలల్లో నిరసన ర్యాలీ నిర్వహించాలని ప్రతిపాదించామన్నారు. ఈ రెండు మార్గాలు దారుస్సలాం నుండి ఈద్గా బిలాల్, చార్మినార్ నుండి ధర్నాచౌక్ మార్గాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ మార్గాల ప్రతిపాదనలను పరిశీలించి ర్యాలీకి అనుమతి ఇవ్వాలని సిపిని కోరామని ట్విటర్ వేదిక ద్వారా ఒవైసి వెల్లడించారు.

Asaduddin Owaisi Fires on Uttam Kumar Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News