హైదరాబాద్ : రాష్ట్రంలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ దుమ్ము లేపాయి. న్యూఇయర్ వేళ డిసెంబర్ 31రాత్రి చిన్నా పెద్దా అంతా న్యూఇయర్ ఫీవర్‌తో ఊగిపోయారు. చాలామంది యువత అర్ధరాత్రి మందు పార్టీల్లో మునిగి తేలారు. మద్యం మత్తులో యువత రోడ్లపైకి వచ్చి హల్చల్ చేసే అవకాశం ఉండటంతో పోలీసులు ఎక్కడికక్కడే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి 3,148 కేసులు నమోదయ్యాయంటే మన మందుబాబులు ఎంతగా తాగి ఊగి ఉంటారో అవగతమవుతోంది. మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్‌ను పోలీసులు కొనసాగించారు.
రాష్ట్రమంతటా చెక్‌పోస్టులను నిర్వహించి మరీ డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. ముందుగానే ఇందుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలను సైతం జారీ చేశారు. రాజధాని హైదరాబాద్ మహానగరం పూర్తి స్ఠాయిలో న్యూఇయర్ జోష్‌లోకి వెళ్లింది. ప్రధానంగా వేడుకల్లో యువత సందడి చేసింది. మంగళవారం అర్థరాత్రి 4 గంటల వరకు జోరుగా వేడుకలు కొనసాగాయి. అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు జరగడంలో జనాలు జోరుగా మద్యం సేవించి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 951, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 873, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 281 కేసులు నమోదయ్యాయి. దొరికినవారిలో అత్యధికంగా టూవీలర్లు నడిపినవారే. కోర్టుకు ఎక్కనున్న వారిలో 21 నుంచి ౩౦ ఏళ్ల లోపువారే ఎక్కువ మంది ఉన్నారు.
బిఎసి(బ్లడ్ ఆల్కహాల్ క్యాలికులేటర్) కౌంట్ అత్యధికంగా 550 పాయింట్లకు చేరుకుంది. మందుబాబులను స్వయంగా దిగబెడతామని బార్లు హామీ ఇవ్వడం, వారు రాత్రి 1.30 దాకా తమ రైళ్లు ఎక్కొచ్చని మెట్రో ఆఫర్ ప్రకటించడంతో డ్రంకెన్ డ్రైవ్ సంఖ్య తగ్గిందని, లేని ఎడల డ్రంకెన్ డ్రైవ్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండేదని అంటున్నారు. ఇదిలా ఉండగా డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిలో మైనర్ల నుండి పండు ముసలోళ్ల వరకూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 9 మంది మైనర్లు పట్టుబడగా.. మరో 9 మంది 65 ఏళ్లకు పైబడిన తాతయ్యలు కూడా పట్టుబడ్డారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన ఈ తనిఖీలలో కేవలం ఒకే ఒక్క మహిళ అందునా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడింది. తెలంగాణ వ్యాప్తంగా నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవ్వగా.. మిగతా జిల్లాల్లో కూడా ఓ మోస్తరుగా కేసులు నమోదయ్యాయి.
Drunk And Drive Cases Across Telangana State
సీ.నెం. యూనిట్ నెం. మహిళలు పురుషులు మొత్తం
- హైదరాబాద్ 0 951 951
2. సైబరాబాద్ 1 872 873
3. రాచకొండ 0 281 281
4. నల్గొండ 0 152 152
5. కరీంనగర్ 0 148 148
6. వరంగల్ 0 116 116
7. సిద్ధిపేట్ 0 99 99
8. జగిత్యాల 0 71 71
9. నిజామాబాద్ 0 65 65
10. రాజన్నసిరిసిల్ల 0 48 48
11. భద్రాద్రికొత్తగూడెం 0 47 47
12. రామగుండం 0 43 43
13. సంగారెడ్డి 0 36 36
14. మహబూబ్‌నగర్ 0 30 30
15. నిర్మల్ 0 28 28
16. మహబూబాబాద్ 0 23 23
17. మెదక్ 0 17 17
18. జయశంకర్భూపాలపల్లి 0 16 16
19. ఆదిలాబాద్ 0 15 15
20. ఖమ్మం 0 14 14
21. కొమురంభీంఆసిఫాబాద్ 0 14 14
22. వనపర్తి 0 12 12
23. జోగులాంబగద్వాల్ 0 10 10
24. వికారాబాద్ 0 9 9
25. సూర్యాపేట 0 9 9
26. కామారెడ్డి 0 7 7
27. నాగర్‌కర్నూల్ 0 7 7
28. ములుగు 0 6 6
29. నారాయణ్‌పేట్ 0 1 1
మొత్తం 1 3147 3148