Tuesday, March 5, 2024

దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగంకు కారణం మొగలులే: ఒవైసీ సెటైర్

- Advertisement -
- Advertisement -

Asaduddin Owaisi

భోపాల్‌: ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బిజెపి, ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  అధికార కమలం పార్టీ దేశంలోని అన్ని సమస్యలకు మొగలులు, ముస్లింలనే నిందిస్తోందని ఆరోపించారు.

‘‘దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. డీజిల్ లీటరు రూ.102కి చేరింది. వీటన్నింటికీ కారణం ఔరంగజేబు. ప్రధాని మోడీ కాదు. దేశంలోని నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. పెట్రోల్‌ ధర లీటర్‌ రూ.104-115కి చేరడానికి తాజ్‍మహల్ కట్టిన వ్యక్తే కారణం. ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్ కట్టి ఉండకపోతే,  లీటర్ పెట్రోల్‍ను ఇవాళ రూ.40కే అమ్మేవారు. ప్రధాని మోడీ.  తాజ్‌మహల్‌, ఎర్రకోట కట్టి షాజహాన్ తప్పిదం చేశారని నేను అంగీకరిస్తాను. దానికి బదులు షాజహాన్‌ ఆ డబ్బునంతా ఆదా చేసి 2014 ఎన్నికల్లో మీకు ఇవ్వాల్సింది. దేశంలోని ప్రతి సమస్యకు ముస్లింలు, మొగలులే కారణమని ప్రచారం చేస్తున్నారు’’ అని ఒవైసీ బిజెపిపై విమర్శల దాడికి దిగారు. ఈమేరకు మధ్యప్రదేశ్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News