Monday, December 4, 2023

డెంగ్యూ కట్టడికి బల్దియా ముందస్తు చర్యలు

- Advertisement -
- Advertisement -

GHMC preventive measures against dengue

పరిశుభ్రతతోనే వ్యాధులకు దూరం
ప్రతివారం 10 నిమిషాల పరిసరాల పరిశుభ్రత

హైదరాబాద్: వర్షకాలం ప్రవేశంతో నగరంలో వరస వర్షాలుకురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల కట్టడికి జిహెచ్‌ఎంసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అదేవిధంగా జిహెచ్‌ఎంసి ఎంటామాలజీ విభాగం నగర వ్యాప్తంగా ఇప్పటికే దోమల కట్టడి ద్వారా వ్యాధులను నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటితో పాటు పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలని, లేకపోతే దోమల ద్వారా ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. వీటితో పాటు చెరువులో దోమల ఉత్పత్తి అరికట్టడానికి డ్రోన్ల ద్వారా నివారణ మందులు పిచికారిచేయడం, సాంకేతిక పద్ధతి లోఫాగింగ్‌చర్యలు చేపట్టడం, ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేపట్టి దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు.

డెంగ్యూ పాజిటివ్ నమోదైన వెంటనే మరొక కొత్త కేసు నమోదు కాకుండా నివారణ చర్యలను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బస్తీలు, కాలనీలో ఇంటింటికి సర్వే చేసి శాంపిల్స్ సేకరించి లక్షణాలను గుర్తించేందుకు ల్యాబ్ కు పంపిస్తున్నారు. తద్వారా డెంగ్యూకి గురైన ఇంటితో పాటు చుట్టూ ప్రక్కల ఇళ్లల్లో కూడా వ్యాధి ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. పిన్ పాయింట్ ప్రోగ్రామ్ ద్వారా 642 బృందాలతో దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రతి సర్కిల్ లో 64 మౌంటెడ్ ఫాగింగ్ మిషన్లు వాహనాలు, ప్రతివార్డు, ప్రతి డివిజన్ లో మారో 10 పోర్తుబుల్ పాగింగ్ మిషన్లు ప్రతి రోజూ నిర్దేశించిన లక్ష్యం మెరకు పాగింగ్ నిర్వహించడం ద్వారా దోమల వృద్దిని కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నారు.

పరిశుభ్రతతో వ్యాధులు దూరం… 
దోమల వృద్దిని అరికట్టేందుకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రపర్చకోవడంతో వారానికి మించి ఉన్న నీటి నిల్వలను పరిశుభ్రపర్చుకోనేందుకు కేటాయించాలని జిహెచ్‌ఎంసిఅధికారులు నగరవాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. డెంగ్యూ వ్యాధికా కారణమైయే ఏడిస్ దోమ మంచినీటిలో ఎక్కువగుడ్లు పెడతాయని, ముఖ్యంగా వారానికి మించి నీరు నిల్వ ఉన్న టైర్లు, కొబ్బరి బోండాలు, వాడకుండా ఉంచిన రోళ్లు,పూల కుండీ అడుగున ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు, పగిలిన మట్టి కుండలు, పాత ఫ్రిజ్ ల వెనుక క్రింద భాగంలో,కూలర్లో, సిమెంట్ ట్యాంక్ లలో గుడ్లు పెడతాయి. గ్రుడ్డు దశ నుండి దోమ దశకు మారుటకు 8 నుండి 10 రోజులు పడుతుందని,.దీంతో ప్రతి వారం ఒక్కసారైన ఈ నీటి నిల్వలను తొలగించడం ద్వారా దోమల వృద్దిని అరికట్టవచ్చాని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. అదేవిధంగాదోమలు కుట్టకుండా దోమ తెరలు వాడడం, నిండుగా దుస్తులు ధరించడంతో పాటు సాయంత్రం సమయాల్లో చేతులకు ఓడామస్ లాంటి పూతలు పూసుకోవాలని వివరిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో కృష్ణ తులసి,లెమన్ గ్రాస్, అడ్డసరము లాంటి మొక్కలు పెంచడంతో పాటు ఇంటిపరిసరాల్లో నీరు నిల్వ ఉంటే కిరోసిన్ , బండి ఆయిల్ వారానికి ఒకసారి వేయడం ద్వారా దోమల వృద్దిని అరకట్టవచ్చాని సూచించారు. ప్రతి ఒక్కరూ, ఇంటి శుభ్రత పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అవసరం.లేని పక్షంలో వ్యాధులను కొని తెచ్చుకున్న వారవుతారని జిహెచ్‌ఎంసి తెలిపింది.

దోమల రకాలు, వ్యాప్తించే వ్యాధులు… 
దోమలు5 రకాలుగా ఉంటాయి. ఒక్కొక్క రకం దోమ వలన ఒక్కొక్క వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. 1. ఈడిస్ దోమ: ఈ దోమలు ఇంటి లోపల, ఇంటి బయట ప్రదేశాల్లో ని చిన్న, చిన్న నీటి నిల్వల్లో పెరిగి, డెంగీ, చికెన్ గున్యా, వ్యాధి వ్యాప్తి చేస్తాయి.2. అనాఫిలస్: మంచి నీటి నిల్వలో పెరిగే ఈ డోమలు కుడితే మలేరియా వస్తుంది. 3. క్యూలెక్స్: మురుగు నీటి నిల్వ లో పెరిగి ఈ దోమ కాటు వల్ల బోధ, మెదడువాపు వ్యాదులు వ్యాప్తి చేస్తాయి.4. మాన్సోనియా: మొక్కలున్న నీటి నిల్వలో పెరిగి ఈ దోమలతో బోధ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.5. అర్మిజరిస్: సెప్టిక్ ట్యాంకు లు పారిశ్రామిక వ్యర్థాలలోఇవి పెరుగుతాయి. వీటి ద్వారా ఏ విధమైన వ్యాధులు రావు కాని ఇవి పీల్చుకునే రక్తం చాలా ఎక్కువ మోతాదులో ఉండి తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి.

డెంగ్యూ వ్యాధి లక్షణాలు.. 
తీవ్రమైన జ్వరం,తీవ్రమైన తలనొప్పి, కంటిలోపలి బాగంలో నొప్పి, వాంతులు, మరియు విరేచనాలు,కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మం పై దుద్దుర్లు, (తీవ్రమైన కేసులలో మాత్రమే)చిగుళ్ల నుండి రక్తస్రావం, హేమా రేజిక్(రక్తస్రావం)డెంగ్యూ వ్యాధి లక్షణాలని, డెంగ్యూ వైరస్ ద్వారా చాలా అరుదుగా మాత్రమే మరణాలు సంభవిస్తాయని జిహెచ్‌ఎంసి తెలిపింది. ఈ దోమల కుట్టడం ద్వారా నవజాతి శిశువులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి డెంగ్యూ వ్యాధి సోకే అవకాశం ఉంటుందని, దోమల వృద్దిని అరికట్టడం ద్వారా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఎంటమాలజి విభాగం చీఫ్ డాక్టర్ రాంబాబు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News