Saturday, September 30, 2023

ఆసియాకప్ 2023: నేడు నేపాల్‌తో పాక్ ఢీ..

- Advertisement -
- Advertisement -

ముల్తాన్: ప్రతిష్ఠాత్మకమైన ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు బుధవారం తెరలేవనుంది. పాక్ లోని ముల్తాన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ లో నేపాల్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆరు జట్లు పాల్గొంటున్న మెగా టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. టోర్నీలో పాల్గొంటున్న జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

భారత్, పాకిస్థాన్, నేపాల్‌లు ఒక గ్రూపులో ఉండగా.. శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ టీమ్‌లో మరో గ్రూపులో ఉన్నాయి. ప్రతి గ్రూపు నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్4కు అర్హత సాధిస్తాయి. ఇక ఆసియాకప్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారిన చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ల సమరం శనివారం పల్లెకెలె వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఆసియాకప్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌లకు పాకిస్థాన్ మిగిలిన మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News