Monday, May 6, 2024

ఆరంభం అదిరింది.. కనువిందు చేసిన ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలు

- Advertisement -
- Advertisement -

హాంగ్‌జౌ: ప్రతిష్ఠాత్మకమైన 19వ ఆసియా క్రీడలకు శనివారం తెరలేచింది. చైనాలోని హాంగ్‌జౌ నగరం వేదికగా మినీ ఒలింపిక్స్‌గా పేరున్న ఆసియా క్రీడలు ప్రారంభమయ్యాయి. హాంగ్‌జౌ ప్రధాన స్టేడియంలో జరిగిన ఆరంభోత్సవ వేడుకలు కనులపండవగా కొనసాగాయి. చైనా సాంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాయి. అక్టోబర్ 8 వరకు సాగే ఈ మెగా క్రీడల్లో భారత్, చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా, పాకిస్థాన్, మలేసియాతో సహా దాదాపు 45 దేశాలు పోటీపడుతున్నాయి. శనివారం జరిగిన ఆరంభ వేడుకలు అభిమానులను కనువిందు చేశాయి. ఆయా దేశాలకు చెందిన క్రీడాకారులు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో నిర్వహించిన కళాకారులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సహా ఆయా దేశాల అధినేతలు, క్రీడా ప్రముఖులు ఆరంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News