Monday, April 29, 2024

ఉన్నత విద్యారంగంలో సాధించాల్సింది చాలా ఉంది

- Advertisement -
- Advertisement -

యూనివర్శిటీల అభివృద్దికి నిధులను వినియోగించాలి
విశ్వవిద్యాలయాల్లో టీచర్ల వయస్సు పెంపు సరైనదే: బి. వినోద్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం విద్యుత్ రంగం, నీటిపారుదల ప్రాజెక్టులు, సామాజిక మౌలిక సదుపాయాల కల్పన, మిషన్ కాకతీయ, వంటి వివిధ రంగాల్లో ఎంతో ప్రగతి సాధించిందని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యాక్షుడు బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ స్టేట్ యూనివర్శిటీ టీచర్స్ 3వ కన్వెన్షన్‌లో రాష్ట్రంలో ఉన్నత విద్య సమకాలీన నేపథ్య సమస్యలు – సాధ్యమైన చర్యలు అనే అంశంపై నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వైద్య కళాశాలల స్థాపన, సంక్షేమ పాఠశాలలు కళాశాలలను బలోపేతం చేయడంతో పాటు ఉన్నత విద్య, ఆరోగ్య రంగంలో చాలా చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సమాజ కేంద్రీకృత చర్యలతో ఉన్నత విద్యా రంగాన్ని పునరుద్ధరించడం తక్షణావసరమని నొక్కి చెప్పారు. యూనివర్శిటీ నిర్మాణాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులను వినియోగించాలని సూచించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌లను అందించడం ద్వారా విద్యార్థులకు వాస్తవిక అనుభవాన్ని పొందేందుకు వివిధ చర్యలను ప్రతిపాదించారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించి టిఎస్ యుటిఏ వివరించిన వివిధ సమస్యలను పరిష్కరించడంలో, విశ్వవిద్యాలయాలలో ఉపాధ్యాయుల వయస్సు పెంపుదల సరైందన్నారు. అన్ని సమస్యలను ప్రభుత్వ అధికారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. భావజాలంతో సంబంధం లేకుండా విద్యార్థులను రాజకీయ భాగస్వామ్యానికి దూరంగా ఉంచడం కుట్ర అని, దీని పర్యవసానాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు.

సూపర్‌యాన్యుయేషన్, రిక్రూట్‌మెంట్, ఓపిఎస్, ఓయూ సిపిఎస్, యుజిసి బకాయిలు, హెల్త్ కార్డ్‌లు, యూనివర్సిటీ బడ్జెట్ పెంపుదల, ఇంజినీరింగ్ ఫ్యాకల్టీలకు ఏఐసిటిఈ నిబంధనల అమలు, సిఏఎస్ ప్రమోషన్‌ల కోసం యుజిసి తాజా నిబంధనలను వన్-టైమ్ ఆప్షన్‌తో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఏ లోగోను ఆవిష్కరించారు. అనంతరం టిఎస్‌పిఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి ప్రసంగిస్తూ ప్రభుత్వానికి చిన్నపాటి పెండింగ్‌లో ఉన్న యూనివర్సిటీ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోరారు. అదే విధంగా టీఎస్‌యూటీఏ అధ్యక్షుడు ప్రొఫెసర్ జి. మల్లేశం అధ్యక్షోపన్యాసం చేస్తూ ప్రాతినిధ్యాల నుంచి ఫలితాల వైపు వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. ఉపాధ్యాయులు సహాయక సిబ్బంది ప్రయోజనాల దృష్ట్యా అన్ని యూనివర్శిటీ అసోషియేషన్‌ల మధ్య ఐక్యత పెంచాలని కోరారు. అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో ఒకే విధమైన నియమాలను అమలు చేయడానికి ఇది చాలా సమయమని చాలా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కేవలం 30 శాతం ఫ్యాకల్టీతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఓయూ ఫ్యాకల్టీ సహాయక సిబ్బందికి సిపిఎస్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం చాలా ఉందని హెల్త్ కార్డు అమలు, యూజీసీ బకాయిల విడుదల చేయాలని సూచించారు. ఈ సదస్సులో, తెలంగాణలోని 15 రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు చెందిన వివిధ యూనివర్సిటీ 55 అధ్యాపకులు మరియు టిఎస్‌యుటిఏ అసోసియేషన్ ప్రతినిధులు విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలను పునరుద్ఘాటించారు. ఈకార్యక్రమంలో ప్రొఫెసర్. సూర్య ధనంజయ, ప్రొఫెసర్. శైలజ, ప్రొఫెసర్. జెవి రావు, ప్రొఫెసర్. సైదా అజీమ్ ఉన్నిన, ప్రొఫెసర్. అనంత లక్ష్మి, డాక్టర్. రమణ రావు, ప్రొఫెసర్. పి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News