Monday, April 29, 2024

కల్వకుంట్ల కవిత ఆశీర్వాదం తీసుకున్న మనీషా పటేల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆధునిక సమాజాభివృద్ధికి మూలం విద్య అని, అన్నివర్గాలకు ఉన్నత నాణ్యమైన విద్య అందిననాడే సమాజం సమగ్రాభివృద్ధి చెందుతుందని బిఆర్‌ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. అన్నిరకాల అభివృద్ధి, వికాసాలకు మూలమైన విద్యారంగాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దటానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో కృషిచేస్తున్నదని ఆమె పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టితో కిందిస్థాయి నుంచే విద్యారంగాన్ని పటిష్ఠం చేసేందుకు కృషిచేస్తున్నారని అన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో గురువారం ఎంకెజి గ్రూప్ అధినేత డా. బి.రవీందర్ నాయక్, మనీషా పటేల్ దంపతులు ఎంపి కల్వకుంట్ల కవితను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తన భార్య మనీషా పటేల్ ఉన్నత విద్య కోసం ఈ నెల 26వ తేదీన విదేశాలకు (యూకేకు ) వెళ్తోందని, వెళ్లే ముందు మీ ఆశీర్వాదాలు తీసుకునేందుకు వచ్చినట్లు రవీందర్ నాయక్ తెలపగా ఈ సందర్భంగా మనీషా పటేల్ ను కల్వకుంట్ల కవిత అభినందించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్య ప్రాధాన్యతను ఆమెకు తెలియజేస్తూ అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News