Saturday, September 21, 2024

ముస్లిం వివాహాలు, విడాకుల రిజిష్ట్రేషన్ బిల్లు ఆమోదించిన అస్సాం

- Advertisement -
- Advertisement -

గౌహతి: రాష్ట్రంలో ముస్లిం వివాహాలు, విడాకుల నమోదును తప్పనిసరి చేస్తూ అస్సాం అసెంబ్లీ గురువారం బిల్లును ఆమోదించింది. ముస్లిం యువతుల జీవన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ సందర్భంగా అన్నారు.

అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవర్స్ బిల్లు 2024ను రెవెన్యూ , విపత్తు నిర్వహణ మంత్రి జోగెన్ మోహన్ మంగళవారం ప్రవేశపెట్టారు. అస్సాంలో ఈ కొత్త చట్టం అమల్లోకి రావడంతో బాల్య వివాహాల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిషేధించబడతాయి.

ప్రశ్నలకు సమాధానమిస్తూ, కాజీలు గతంలో జరిపిన వివాహాల రిజిస్ట్రేషన్లన్నీ చెల్లుబాటు అవుతాయని, కొత్తవి మాత్రమే చట్టం పరిధిలోకి వస్తాయని శర్మ స్పష్టం చేశారు.

“ముస్లిం పర్సనల్ చట్టం ప్రకారం ఇస్లామిక్ ఆచారాల ప్రకారం జరిగే వివాహాలలో మేము అస్సలు జోక్యం చేసుకోవడం లేదు. ఇస్లాం నిషేధించిన వివాహాలను నమోదు చేయకూడదనేది మా ఏకైక షరతు” అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News