Thursday, July 18, 2024

ఆస్ట్రాజెనెకా టీకాతో గుండెపై దుష్ఫ్రభావాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొవిడ్ 19 పై పోరుకు ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా సంస్థలు ఉత్పత్తి చేసిన టీకా వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని భారత సంతతికి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు అసీమ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఈ టీకాను భారత్‌లో కొవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ వల్ల గుండెపోటు, పక్షవాతం, రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని మల్హోత్రా తెలిపారు.

ఈ తరహా దుష్ప్రభావాలు ఉన్నాయంటూ ఎంఆర్‌ఎన్‌ఎ కొవిడ్ టీకాలను నిషేధించాలని ఆయన చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే కొవిషీల్డ్‌తో గుండెపై ఇంతకు మించిన స్థాయిలో నష్టాలు ఉంటాయని ఆయన తాజాగా పేర్కొన్నారు. బ్రిటన్‌లో ఈ టీకా పొందిన వారిలో పదిశాతం మందికి ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News