Wednesday, December 4, 2024

మ్యాక్స్‌వెల్ విధ్వంసక సెంచరీ

- Advertisement -
- Advertisement -

భారత్‌పై ఆస్ట్రేలియా సంచలన విజయం

గౌహతి: భారత్‌తో మంగళవారం జరిగిన రెండో టి20లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గౌహతితో వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసక శతకంతో ఆస్ట్రేలియాకు సంచలన విజయం సాధించి పెట్టాడు.

భారత బౌలర్లను హడలెత్తించిన మ్యాక్స్‌వెల్ పరుగుల వరద పారించాడు. 48 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 8 బౌండరీలతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి కెప్టెన్ మాథ్యూవేడ్ 28 (నాటౌట్) అండగా నిలిచాడు. చివరి రెండు ఓవర్లలో 45 పరుగులు చేయాల్సి ఉండడంతో భారత్‌కు విజయం ఖాయమే అనుకున్నారు. కానీ, వేడ్, మ్యాక్స్‌వెల్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు.

ఈ గెలుపుతో ఆస్ట్రేలియా సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం భారత్ సిరీస్‌లో 21 ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన రుతురాజ్ 57 బంతుల్లోనే 7 సిక్సర్లు, 13 ఫోర్లతో 123 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక సూర్యకుమార్ 39, తిలక్ వర్మ 31 (నాటౌట్) అతనికి అండగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News