Sunday, April 28, 2024

రెస్కూ టీమ్‌తో మమేకమైన ఆర్నాల్డ్ డిక్స్

- Advertisement -
- Advertisement -

24 గంటలూ కార్మికుల క్షేమమే కాంక్షించిన ఆస్ట్రేలియా టన్నెలింగ్ నిపుణుడు

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్‌క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించే రెస్కూ ఆపరేషన్‌లో కీలకంగా వినిపించిన పేరు ఆర్నాల్డ్ డిక్స్. మన ఊరు కాదు.. మన దేశం కూడా కాదు. అయినా ఇంత దూరం వచ్చి అందరితో మమేకమవుతూ రక్షణ చర్యల్లో పాలు పంచుకున్న ఈ విదేశీయుడు రోజులో 24 గంటలు ఎందుకింత కష్టపడ్డాడని అందరికీ అనిపిస్తూ ఉండవచ్చు. అయితే అతని గురించి తెలిసిన వారికి మాత్రం ఇదేమీ ఆశ్చర్యం కాదు. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్‌పర్ట్ ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ ఆస్ట్రేలియా స్వతంత్ర విపత్తు పరిశోధకుడు.

అంతర్జాతీయ టన్నెలింగ్ అధ్యక్షుడు కూడా. సిల్‌క్యారా టన్నెల్ రెస్కూ ఆపరేషన్‌ను సవాలుగా తీసుకున్నారు. నవంబర్ 20నుంచి రెస్కూ ఆపరేషన్‌లో దిగిపోయారు.అప్పటినుంచి సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికలును తన సొంత బిడ్డలుగా భావించి వారి యోగక్షేమాల కోసం పరితపించారు.అటు కార్మికలుతో మాట్లాడి వారికి భరోసా కల్పిస్తూనే ఇటు రక్షణ చర్యలను కొనసాగించారు. భూగర్భ టన్నెలింగ్‌లో ప్రపంచంలోనే ప్రముఖ నిపుణుడైన డిక్స్ భూగర్భ, రవాణా రంగంలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.

సిల్‌క్యారా టన్నెల్ సైట్‌లో తనిఖీలు నిర్వహించి, సహాయక చర్యల్లో పాల్గొన్న ఏజన్సీలతో చర్చించిన తర్వాత కార్మికులను రక్షించడంపై ఓ భరోసా కల్పించారు. వారికి ఆహారం, నీళ్లులాంటి అత్యవసర సహాయం అందించారు. వాళ్లతో ఫోన్లలో మాట్లాడడం, వీడియోలతో వారి కుటుంబ సభ్యులకు కూడా ఊరట కల్పించారు. క్రిస్మస్ నాటికల్లా కార్మికులు క్షేమంగా బయటికి వస్తారని మొదట చెప్పింది కూడా ఆయనే. ఇప్పుడు అందరూ డిక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ కొండప్రాంతం మనకు ఒక్క విషయాన్ని చెప్పిందని, అదే వినయంగా ఉండాలని ఆయన అంటారు. ఇప్పుడు కార్మికులంతా క్షేమంగా బయటికి వచ్చినందుకు భారతీయులంతా డిక్స్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News