Saturday, July 27, 2024

కరోనాపై పోరాడే వైరస్‌ను రూపొందించిన ఆస్ట్రేలియా సైంటిస్టులు

- Advertisement -
- Advertisement -

Australian Scientists

 

మెల్బోర్న్: ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తోడ్పడే ఒక కొత్తరకం వైరస్‌ను ఆస్ట్రేలియా సైంటిస్టులు ప్రయోగశాలలో రూపొందించారు. ఇదొక ఘనవిజయం అని వారన్నారు. చైనా వెలుపల ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిసారి. కచ్చితంగా పరిశోధన చేసి, ప్రపంచ వ్యాప్తంగా వ్యాధిని గుర్తించేందుకు దీన్ని రూపొందిస్తున్నామని అంటువ్యాధులపై పరిశోధన సాగించే పీటర్ డోహిర్టీ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు. మెల్బోర్న్ యూనివర్శిటీ, రాయల్ మెల్బోర్న్ హాస్పిటల్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ‘ నూతన కరోనా వైరస్ జినోమ్ సీక్వెన్స్‌ను చైనా అధికారులు విడుదల చేశారు. వ్యాధిని గుర్తించడానికి అది తోడ్పడుతుంది. అయితే అసలైన వైరస్ ద్వారా దాన్ని కచ్చితంగా నిర్ధారించేందుకు, తీవ్రతను గుర్తించేందుకు అన్ని పరీక్షా పద్ధతుల్ని ఉపయోగించుకుంటున్నాం. వ్యాధి నిర్ధారణలో ఇదొక ముందడుగు’ అని ది రాయల్ మెల్బోర్న్ ఆస్పత్రి కి చెందిన జులియన్ డ్రౌస్ చెప్పారు.

Australian Scientists who invented virus to fight corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News