Monday, May 26, 2025

రజనీకాంత్‌ సినిమాలో బాలకృష్ణ.. ఫ్యాన్స్‌కు పూనకాలే?

- Advertisement -
- Advertisement -

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా వస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఈ సీక్వెల్‌కు సంబంధించి ప్రకటన చేస్తూ.. ఓ వీడియోని కూడా వదిలారు చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి కోలివుడ్ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది.

జైలర్ మొదటి భాగంలో మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఆ పాత్రల నిడివి కొంతే అయినా.. ఫ్యాన్స్‌పై చాలా ప్రభావం చూపించింది. అయితే ఇప్పుడు జైలర్-2లో బాలకృష్ణ నటిస్తున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. చిత్ర బృందం బాలకృష్ణని ప్రత్యేక పాత్ర కోసం అడగగా.. ఆయన అందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఫ్యాన్స్‌కి ఇక పూనకాలే అని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News